బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరిక

నవతెలంగాణ- కమ్మర్ పల్లి:
 మండలంలోని రాజరాజేశ్వరి నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మల్లేష్, నటరాజ్, ప్రశాంత్ మరో 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం   మోర్తాడ్ లోని ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్యాల సునీల్ కుమార్ గెలుపులో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. అనంతర ముత్యాల సునీల్ కుమార్  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సబ్బండ కులాలను ఆదుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ తోనే సంక్షేమం సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
 ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి విజయ్ కుమార్, కొమ్ముల రవీందర్, ఎనుగందుల శైలేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.