బీఆర్‌ఎస్‌ నుండి బీజేపీలోకి చేరికలు

– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొండేటి శ్రీధర్‌
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మోడీ చేస్తున్న అభివద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి యువకులు భారీ సంఖ్యలో బిజెపి పార్టీలోకి చేరారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట నియోజకవర్గం అభ్యర్థి కొండేటి శ్రీధర్‌, పార్టీ జిల్లా ఇన్చార్జి కోమటిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి లు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్‌ మాట్లాడుతూ చేస్తున్న అవినీతిరహిత పరిపాలనను చూసి ప్రజలు బిజెపి పార్టీలోకి వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు చిటూరి రాజు, మాజీ పట్టణ అధ్యక్షులు కొండేటి సత్యం, ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌ ను వీడి బిజెపిలో చేరారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచమే హర్షిస్తున్న తీరును స్వాగతిస్తూ కేవలం బిజెపి వల్లనే తెలంగాణ రాష్ట్రం కూడా అభివద్ధి చెందుతుందని, ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో సాయి కుమార్‌, ప్రభు చరణ్‌, చరణ్‌, బాబుల్‌, రాజు, రాకేష్‌, ప్రవీణ్‌ నవీన్‌, బన్నీ, రాజు, రాకేష్‌, శుషి బాలాజీ, మల్లేష్‌, రంజిత్‌ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు రాయపురపు కుమారస్వామి, నియోజకవర్గ కన్వీనర్‌ ముత్తిరెడ్డి కేశవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి పెళ్లి రాజేశ్వర్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాది తిరుపతిరెడ్డి, ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బన్న ప్రభాకర్‌, మాజీ ఎంపీటీసీ జలగం రంజిత్‌, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి పెద్దూరి రాజ్‌ కుమార్‌, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఐత రవి, మండల కిసాన్‌ మోర్చా అధ్యక్షులు కర్క సోమిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లెపాక అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌ : అభివద్ధికి నోచుకోని పరకాల నియోజకవర్గం అభివద్ధి బిజెపి తోటే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు గట్టు వేణు గౌడ్‌ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి యువకులు మాజీ ఎమ్మెల్యే మోలుగురు బిక్షపతి సమక్షంలో బిజెపిలో చేరారు వారందరికీ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, బూత్‌ కమిటీ అధ్యక్షులు కొమ్ముల భద్రయ్య, బిజెపి నాయకులు దుబాసి వెంకటస్వామి, కొమ్ముల ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.