నవతెలంగాణ- మోపాల్: నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని డిచ్పల్లి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఆరెపల్లి సర్పంచ్ మల్లేష్, నూడా చైర్మన్, ఒలింపిక్ అధ్యక్షులు ఈగ సంజీవ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ కెసిఆర్ యొక్క పథకాలు, అభివృద్ధి పనులకు అకర్షితులై పార్టీ లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ చేరిక ల కార్యక్రమం లో నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి, మెంట్రాస్ పల్లి సొసైటీ అధ్యక్షులు, డిచ్ పల్లి బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి, గ్రామానికి చేందిన జి. రాజు, కూన గంగారాం, గణేష్, రమేష్, బాబాయ్య, సాయన్న, గంగరాజు, మహిళలు పార్టీ లో చేరిన వారిలో వున్నారు.