బీజేపీలో పార్టీలో చేరికలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఇతర పార్టీల నుండి బీజేపీ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్, నర్సారెడ్డి, వసంత్ రెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.