హల్‌చల్‌ చేస్తున్న జూమ్‌.. జూమ్‌.. సాంగ్‌

నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా గ్యారీ పిహెచ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పై’. ఈడి ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌పై కె రాజశేఖర్‌ రెడ్డి నిర్మాతగా సుభాష్‌ చంద్రబోస్‌ సీక్రెట్‌ స్టోరీ, డెత్‌ మిస్టరీ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. ‘జూమ్‌ జూమ్‌’ అంటూ సాగే ఈ పాట నిఖిల్‌, ఐశ్వర్య మీనన్‌ మధ్య వచ్చే లవ్‌ రొమాంటిక్‌ సాంగ్‌. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బేహారా పాడిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. అలాగే శ్రీ చరణ్‌ పాకాల కూడా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘తూటాలే పేలుస్తుంటే నీ చిరు నగవే, అందాల గాయం తగిలే నా ఎదకే..’ వంటి లిరిక్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. క్యాచీ పదాలతో సాగే ఈ మెలోడీ సాంగ్‌ శ్రోతల మనసు దోచేసింది. ప్రస్తుతం ఈ పాట కుర్రకారు గుండెలను మీటుతూ సోషల్‌ మీడియాలో సంచలనం సష్టిస్తోంది. భారత దేశ అత్యుత్తమమైన రహస్య కథను చరిత్రలో నిలిచిపోయే స్పై థ్రిల్లర్‌ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, తమిళ్‌, మళయాళం, కన్నడ భాషల్లో ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఆర్యన్‌ రాజేష్‌, సన్యా ఠాకూర్‌, అభినవ్‌ గోమటం, మకరంద్‌ దేశ్‌పాండే, జిషు సేన్‌ గుప్తా, నితిన్‌ మెహతా, రవివర్మ, కష్ణ తేజ, ప్రిషా సింగ్‌, సోనియా నరేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం -ఎడిటింగ్‌ : గ్యారీ బీఎచ్‌, కథ -నిర్మాత: కె. రాజశేఖర్‌ రెడ్డి, సీఈఓ: చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి, డీఓపీ: వంశీ పచ్చి పులుసు, మార్క్‌ డేవిడ్‌, అదనపు సినిమాటోగ్రఫీ: జూలియన్‌ అమర్‌ ఎస్ట్రాడా, కైకో నకహరా, సంగీతం : శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌, ఆర్ట్‌ : అర్జున్‌ సూరిశెట్టి.