కారులో.. చేరికల జోష్

– కండువాలు కప్పి ఆహ్వానించిన.
– బీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని మల్హర్ ,మహాముత్తారం, కాటారం, మహాదేవపూర్, పలిమేల తోపాటు పలు మండలాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో  శనివారం తాడిచెర్ల, పెద్దతూoడ్ల, చిన్నతూoడ్ల, కొయ్యుర్, మల్లారం తదితర గ్రామాల్లో వలసల పరంపర కొనసాగింది. శనివారం తాడిచెర్లలో ముఖ్యకార్యకర్తల సమావేశం విస్తృతంగా కొనసాగిన నేపథ్యంలో కారులో చేరికలు జొస్ కనిపించింది.ఇన్నాళ్ళ కాంగ్రెస్ లో అసమ్మతితో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు దాదాపు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి మంథని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట గులాబీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని, సర్పంచ్ సుంకరి సత్తయ్య, ఎంపిటిసి రావుల కల్పన మొగిలి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, కొప్సన్ ఆయూబ్ ఖాన్, యూత్ అధ్యక్షుడు హరీష్, నాయకులు తాజాద్దీన్, యాదగిరి రావు, కోట రవి, మల్లేష్, సదానందం, సమ్మయ్య, మార్కు, బాలయ్య పాల్గొన్నారు.