రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బీ) లో పెట్రోల్ బంక్ ప్రాంతంలో రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాదులోని పవన్ నగర్ కు చెందిన బాలాజీ(30), మరో మహిళతో ద్విచక్ర వాహనం  పై వెళ్తుండగా కారు ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో బాలాజీ(30) సంఘటన స్థలంలోనే మృతి చెందాగ, ద్విచక్ర వాహనం పై ఉన్న  మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును స్థానికులు వెంబడిoచి పట్టుకుని కారులోని ఇద్దరిని చితకబాదారు. సంఘటన స్థలానికి మృతుని తల్లి వచ్చి తీవ్రంగా రోదించడం అక్కడున్నవారిని కలచి వేసింది. కార్ లో ఉన్న వారిని పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళారు.
Spread the love