– ఎంపీడీఓ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రోబీషీనరీ కాలం ముగిసిన జేపీఎస్ లను క్రమబద్ధీకరణ చేయాలని చేపట్టిన జేపీఎస్ ల సమ్మె పలితానిచ్చింది. ఎట్టకేలకు జేపీఎస్ లను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మండలంలోని జేపీఎస్ లు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జేపీఎస్ అద్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చింతలపల్లి సంజీవ రెడ్డి హజరై సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకుడు దారం తిరుపతి రెడ్డి, మండలంలోని అయా గ్రామాల జేపీఎస్ లు హజరయ్యారు.