
తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరుకు పెద్ద కొడప్గల్ మండల కేంద్రములో విద్యుతు సబ్స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే గంగారం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, రైతులకు విద్యుత్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నందున అందుకు నిరసనగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడమైనది. రాష్ట్ర బిఆర్ఎస్ ప్రభుత్వము మరియు రేవంత్ రెడ్డిపై కరెంట్ విషయంలో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉన్నది. వారి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ పూర్తి అవగాహనతో ఉన్నది. రాబోయే ఎన్నికలలో రైతులకు ఎన్నో చేయూతనిచ్చే పథకాలను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తున్నది.రైతులకు గిట్టుబాటు ధర గాని, ఎరువుల విషయంలో గానీ, విత్తనాల విషయంలో గానీ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంది. కెసిఆర్ కు రాబోయే రోజులలో ప్రజలే గుణపాఠం చెబుతారు అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రణయ్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మాధవరావు, వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, మహేందర్ రెడ్డి, చిప్ప మోహన్, కాంతారెడ్డి, బాలా గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.