వీపనగండ్ల: మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు పరామర్శించారు గ్రామానికి చెందిన పాండురంగయ్య చారి, మధుగని బాలయ్యలను కలిసి ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.. అదేవిధంగా రాజా బాబు చారి భార్య చనిపోవడం జరిగింది, రెండు రోజుల క్రితం గోవు బాబు రెడ్డి మతి చెందాడు. వారి కుటుంబాలను పరామర్శించారు అదేవిధంగా గ్రామానికి చెందిన ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన శ్రీకాంత్ను పరామర్శించారు. క్యాన్సర్ వ్యాధితో మతి చెందిన వ్యక్తం అలివేల కుటుంబ సభ్యులను మంచి ధైర్యం చెప్పారు. అదేవిధంగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో వినాయకునికి పూజలు నిర్వహించారు. వీరి వెంట ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి కష్ణ ప్రసాద్, మాజీ కొల్లాపూర్ మార్కెట్ మాజీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, కొప్పునూరు మాజీ సర్పంచ్ బీచ్పల్లి యాదవ్, మాజీ మండల రైతు బంధు అద్యక్షులు ఎత్తం కష్ణయ్య యాదవ్ వీపనగండ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్ వెంకటయ్య, రవీందర్ రెడ్డి, బసవరాజ్ గౌడ్, గోపి, కావలి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.