ఇప్పుడే పరిచయమే..

శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన యూనిక్‌ ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్‌, ప్రగతి శ్రీవాస్తవ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంతో భరత్‌ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రొద్దుటూరు టాకీస్‌ పతాకంపై ఎన్‌ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ‘ఇప్పుడే పరిచయమే..’ పాటని హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ లాంచ్‌ చేశారు. గోపిసుందర్‌ ఈ పాటని లవ్లీ అండ్‌ మెస్మరైజింగ్‌ మెలోడీగా కంపోజ్‌ చేశారు. ఈ పాటకు ఆస్కార్‌ విన్నర్‌ చంద్రబోస్‌ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్మాన్‌ మాలిక్‌ పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలపించేలా ఉంది. ఈ పాటలో లీడ్‌ పెయిర్‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈనెల 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.