– అధికారంలోకి రాగానే అమలు చేస్తాం
– మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
– బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే కు ఘన స్వాగతం
నవతెలంగాణ-మల్హర్‌రావు
జాతీయ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ ఇటీవల యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ లో ప్రకటించిన అంశాలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేవిధంగా ఉన్నాయని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. కర్ణాటక రాష్ట్ర ఇంచార్జి వ్యవహరించి, రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు కషి చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీదర్ బాబుకు మల్హర్, కాటారం, మహాదేవ్ పూర్, మహాముత్తారం,పలిమేల మండలాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,యూత్,మహిళ నాయకురాళ్లు నాగులమ్మ నుంచి కాటారం వరకు బైక్ ర్యాలీలో వేలాది మంది ఘన స్వాగతం పలికి, పూలమా లలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా రోడ్ షో ఎమ్మెల్యే మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల ర్పించిన అమరవీరుల కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు రూ.25వేలు ఇస్తూ అమరవీరుల గౌరవ పింఛన్. ఉద్యమంలో పాల్గొన్న యువతపై కేసులు ఎత్తివేసి జూన్ 2న వారిని తెలంగాణ ఉద్యమ కారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత, మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి సంవత్సరంలో ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీ బ్యాంక్ లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2నాటికి అన్నిశాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల రూ.4వేలు నిరుద్యోగ భృతి చెలిస్తామన్నారు.ప్రత్యేక చట్టంతో టిఎస్ పిఎస్సి ప్రక్షాళన చేసి యుపి ఎస్సి తరహాలో పునరుద్ధరణ. కాంగ్రెస్ హ యాంలో నిరుద్యోగ రహిత రాష్టంగా తెలంగాణను తీర్చి దిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ను ఏర్పాటు చేసి, ఏడు జోన్లలో ఎంప్లారు మెంట్ ఎక్స్జెంజ్ లను ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను నెలకొ ల్పడం. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీలలో తెలంగాణ యువతకు 75శాతం రిజర్వేషన్లు కల్పన. విద్య,ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణ సదు పాయ కల్పన, ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీ ఇడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులం దరికి పిజు రియంబర్స్ మెంట్ తోపాటు పాత బలాయిలు పూర్తిగా చెల్లిస్తామన్నారు. పాలమూరు,తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సి టీలుగా మార్చడంతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ లలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు. బాసరలోని రాజివ్ గాంధీ త్రిబుల్ ఐటి తరహాలో నాలుగు నూతన త్రిబుల్ ఐటిలను ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికాలోని ఐఎంజి అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. పోలీస్ ు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లలో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేసి 6వ తరగతి నుంచి పట్ట భధ్రులైయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామ న్నారు. 18 సంవత్సరాలు పైబడి చదువుకొనే ప్రతి యువతులకు ఎలక్ట్రానిక్ స్కూటర్లు అందజేస్తామాన్నరు. ఇవన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.