– అక్రమార్కులు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారు
– పోలీసులు అండతో బెదిరిస్తున్నారు
– పోలీసులు వాళ్లకే వత్తాసు పలకడం బాధాకరం
– భూ బాధితుల ఆవేదన కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వినతి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం గుండ్లమ ర్పల్లి శివారులోని వ్యవసాయ భూమికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ పోలీ సులు అక్రమార్కులకు వత్తాసుపలుకుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీంతో భూ భూ యజమానులు, బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
‘ మంగలి లక్ష్మయ్య సర్వే నంబర్లు 54, 60 రెంటి లో మొత్తం విస్తీర్ణం 32 ఎకరాలు 05 గుంటల భూ మి కొనుగోలు చేశాడు. ఇది బాధితులకు వారసత్వం గా వచ్చింది. 1996 సంవత్సరంలో కొడుకులు మంగలి అంతయ్య, రామచేంద్రయ్య, రామస్వామి, ఎల్లయ్య, నర్సింహులు, మంగలి విఠల్ పేరునా పట్టమార్పిడి చేసుకున్నారు. అయితే బాధితులకు తెలియకుండా కొందరు ఈ భూమి రికార్డులు మార్చా రు. ఈ విషయంపై బాధితులు కోర్టుకు వెళ్లారు. దీం తో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే అక్రమార్కులు పోలీసులతో కలిసి ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించారు. బాధితులను మాట్లాడుదామని పోలీ సుస్టేషన్‌కు పిలిచి వేధింపులకు గురిచేశారు. సీఐ, ఎస్‌ఐల వేధింపులు భరింలేకపోతున్నాం. కోర్టు ఆదేశా లు ఉంటే మాకేంటి ఫైనల్ ఆర్డర్ తీసుకరావాలని భేదిరిస్తున్నారు’ అని మహిళా రైతులు సంగమ్మ , అను సుజా, లలిత, గౌరమ్మ, చెంద్రకళ, అన్నపూర్ణలు ఆందో ళన వ్యక్తం చేశారు. తమను తిట్టి జైలుకు పంపుతా మని బెదిరించినట్టు మంగలి శ్రీనివాస్ తెలిపారు. రెవెన్యూ విషయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్న పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. అందరూ తమకే అండగా ఉన్నారని పోలీసులు బెదిరిస్తున్నారని బాధితులు ఆవే దన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని మోమిన్‌పేట్‌లో 1994 లో 38 ఎకరాలు, మర్పల్లి మండలం నర్సాపూర్‌లో 22 ఎకరాలు, తుమ్మల పల్లి లో 14 ఎకరాలు, మల్లికార్జునపల్లి బేచిరాగ్ గౌవ్ (దీప ములేని ఊరు) శివలో కొంతభూమి, గుండ్ల మర్పల్లిలో శివారులో 80 ఎకరాలు, భూచనపల్లిలో 18 ఎకరా లు, పట్లూరులో 26 ఎకరాలు తమదే అంటూ లాక్కు న్నారని ఆరోపించారు. రాజుల కాలంలో తాము దొ రలమంటూ గొప్పలు చెప్పుకొని ఈ అక్రమాలకు పా ల్పడుతున్నారని మండిపడ్డారు. తమ ఇంటి పేర్లను, తాతల పేర్లను మార్పిడి చేసుకొని, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.