అక్టోబర్‌ 9, 10న కబడ్డీ వేలం

– ప్రొ కబడ్డీ లీగ్‌ నిర్వాహకుల వెల్లడి
ముంబయి : ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) ఆటగాళ్ల వేలం అక్టోబర్‌ 9, 10న ముంబయిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు పీకెఎల్‌ నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9న ముంబయిలోనే ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైనా.. ఓ వైపు భారత జట్ల ఆసియా క్రీడల శిక్షణ శిబిరం జరుగుతుండగా.. ఇప్పుడు ఆటగాళ్ల వేలం వద్దని భారత కబడ్డీ సమాఖ్య పీకెఎల్‌ నిర్వాహకులను కోరింది. దీంతో ఈవెంట్‌ను వాయిదా వేసిన నిర్వాహకులు.. తాజాగా నూతన తేదీలని వెల్లడించారు.