కడియం శ్రీహరికి దమ్ముంటే…ఎమ్మెల్సీకి రాజీనామా చెయ్‌…

– కాంగ్రెస్‌ అభ్యర్థి సింగపురం ఇందిర
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్‌
కడియంకు దమ్ముంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి బరిలో నిలవాలని సవాల్‌ విసిరారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ ప్రెసిడెంట్‌తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. నాడు కేటీఆర్‌ సిరిసిల్లలో దళితులను థర్డ్‌ డిగ్రీతో కొట్టించి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానంటే నమ్మలేదని, ఉప ముఖ్యమంత్రి గా 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల దుస్థితికి ఈ ప్రాంత అధికార పార్టీ నేతలే కారణమన్నారు. 30 రాజ కీయ చరిత్ర అని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి రెండు సార్లు మంత్రిగా, ఓసారి ఎంపీగా, డిప్యూటీ సీఎంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధి చూస్తే శూన్యమన్నారు. ఎన్‌ కౌంటర్ల శ్రీహరిని అని నాడు వారి పార్టీ నాయకుడు హరీష్‌రావే అన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ నాయకు లను ఏమార్చి, కిడ్నాపర్ల శ్రీహరిగా మారానని విమర్శిం చారు. తాను కట్టించిన డబల్‌ ఇండ్లు, ఉద్యోగాలు చెప్తేనే ఓట్లు వేస్తారని, కిడ్నాపులతో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిం చారు. నియోజకవర్గంలో ఓటు హక్కు లేని, కనీసం ఇల్లు లేని కడియం ఓడిపోతున్నాననే భయంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో నిలవాలని సవాల్‌ చేశారు. తెలంగాణను కాపాడుకోవడమే కాంగ్రెస్‌ గ్యారేంటీ పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ తెలంగాణను కాపాడుకోవడమే కాంగ్రెస్‌ గ్యారేంటీ అన్నారు. రాజయ్య మొదటి కృష్ణుడైతే, రెండోది కడియం శ్రీహరి అన్నారు. వీరిద్దరూ సైలెంట్‌ గా ఉండి చెల్లె సుభద్ర గెలిపించు కోవాలని హితవు పలికారు. సోనియమ్మ నాయకత్వంలో రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. బిల్లా రంగాలుగా కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను ఎక్కువగా ప్రచారం చేసింది వీరే కదా అన్నారు. ఇండ్లు, భూములు, నీళ్లు, ఉద్యోగాలు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీయని, కాంగ్రెస్‌ పార్టీ అంటేనే త్యాగమని దేశం కోసం ఇందిరా గాంధీ, ప్రపంచ శాంతికి రాజీవ్‌ గాంధీ చనిపోయిన చరిత్ర ఉందని, ఒక టిక్కెట్‌ కోసం అద్దంకి దయాకర్‌ త్యాగం చేయడం గొప్ప విషయం కాదన్నారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఇదే స్ఫూర్తితో, అధికారంలోకి వచ్చాక రానున్న రేవంత్‌ నాయకత్వంలో తగిన గుర్తింపు ఉంటుందనే గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను దోచుకొని దాచుకున్న సొమ్ముతో మరలా కొందామని ప్రజల్ని అవమానపరుస్తూ వస్తున్నారని, ఇస్తే తీసుకొని చేతి గుర్తు, కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ అభ్యర్థి సింగపురం ఇందిర, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, రాష్ట్ర అబ్జర్వర్‌ శోభారాణి, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, ఉపాధ్యక్షులు జగదీష్‌ రెడ్డి, సుభాష్‌ రెడ్డి, కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, లింగాజీ, చేపూరి చిరంజీవి, అనిల్‌, దిలీప్‌ రెడ్డి, మండలాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, అనుబంధ కమిటీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.