
నవతెలంగాణ- కంటేశ్వర్:
ఈనెల 19వ తేదీన ప్రతి గ్రామంలో సంఘం కార్యాలయాల ముందు సంఘం జెండా ఆవిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు గౌడ గీత కార్మికులందరికీ పెద్ది వెంకట రాములు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు, జిల్లా నాయకులు- కోయడ నరసింహులు గౌడ్, శ్రీరామ్ గౌడ్, బాబు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1957 అక్టోబర్ 19వ తేదీన గార్ల మండలో ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ కలుగీత కార్మిక సంఘం 2014లో మార్చుకున్నాం. మన సంఘం ఏర్పడి నేటికీ 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 66 సంవత్సరాల వార్షికోత్సవ సభలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. 19వ తేదీన ప్రతి గ్రామంలో సంఘం కార్యాలయాల ముందు సంఘం జెండా ఆవిష్కరణ చేయాలని గౌడ గీత కార్మికులందరికీ పెద్ది వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆరోజు జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో గీత వృత్తి రక్షణ, గీత కార్మికుల సంక్షేమం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించనున్న మేనిఫెస్టో లో చేర్చాల్సిన డిమాండ్స్ ని ఫైనల్ చేసి పత్రిక ముఖంగా విడుదల చేస్తాం. ఆయా పార్టీలకు రాష్ట్ర సంఘం తరఫున మా డిమాండ్స్ పత్రాన్ని పంపిస్తాం. మేము సూచించిన డిమాండ్స్ ని ఆయా రాజకీయ పార్టీలు వాళ్లు ప్రకటించే మేనిఫెస్టోలో ప్రకటిస్తేనే రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మా గీత అన్నల మద్దతు ఉంటుందని గుర్తు చేస్తున్నాం. అందుకని మా కోసం పనిచేసే వారికే మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి 20 తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 66వ వార్షికోత్సవ సభకు అధిక సంఖ్యలో గౌడ గీత కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు జిల్లా గీత కార్మికులందరికీ విజ్ఞప్తి చేశారు.