నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల్ సమస్యలు పరిష్కరం కోరుతూ జుక్కల్ నియోజకవర్గంలో ఆయ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు విధులను బహిష్కరించారు.గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతు హోంగార్డు లు తమ విధులను బహిష్కరించినట్లు తెలిపారు.దింతో పాటు గానే హైదరాబాద్ నగరంలో రవీందర్ అనే హోంగార్డు ఆత్మహత్య కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఇకనైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హోంగార్డు లు.సాయగౌడ్,అంజయ్య,లాలసింగ్,సం జీవ్ రెడ్డి,మారుతి.శ్రీనివాస్,నగరా జ్,రవి,పాల్గొన్నారు.