సుందరయ్య కు నివాళులు అర్పిస్తున్న కనకయ్య

– సుందరయ్య ఆశయాలు ఆచరించడం మే ఆయనకు నిజమైన నివాళి – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
భారత కమ్యూనిష్టు పార్టీ(మార్క్సిస్టు) వ్యవస్థాపకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య తన జీవిత కాలం ఏ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసారో,ఏ రంగాల పురోభివృద్ధి కొరకు పాటుపడ్డారు,ఆయన ఏ ఆశయాలతో జీవించారో వాటిని ప్రస్తుతం మనం ఆచరణలో పెట్టడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య అన్నారు. సుందరయ్య 38 వర్ధంతి సభను శుక్రవారం పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కనకయ్య మాట్లాడుతూ తన పేరు చివర రెడ్డి కులాన్ని సూచిస్తుందని దాన్ని తొలగించుకుని తాను సుందరయ్య గా మారారు అని,సంతానం ఉంటే సమాజం సేవకు ఆటంకం ఏర్పడుతుందని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని సమాజమే తన కుటుంబంగా జీవించిన మహోన్నత వ్యక్తిత్వం అని కొనియాడారు.పార్లమెంట్ సభ్యుడిగా సైకిల్ పై సమావేశాలకు వెళ్ళిన అరుదైన ప్రజాప్రతినిధి అని తెలిపారు.మన చదివే ప్రతీ అంశం,నేర్చుకునే పని సామాజిక ప్రయోజనం కోసం అయి ఉండాలని నిరూపించిన సామాజిక తత్వవేత్త గా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కార్యదర్శి చిరంజీవి, ముళ్ళగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు,మడకం గోవిందు, జగన్నాధం, భద్రం, మురళీ పాల్గొన్నారు