సిర్నాపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ తేలు విజయకుమార్, ఉప సర్పంచ్ కంచర్ల నవీన్ గౌడ్, ఎంపీటీసీ కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు శోభ, తాళ్ల అనసూయ, రాజవ్వ, సెక్రెటరీ నగేష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ తేలు విజయ్ కుమార్, ఎంపిటిసి కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, ఉప సర్పంచ్ నవీన్ గౌడ్ లు కోరారు.
ఈ కార్యక్రమంలో సిర్నాపల్లి గ్రామంలో 18 సంవత్సరముల పైబడిన వారు 2000 మంది ఉన్నారని వారందరికీ సుమారు 15 రోజులలో పూర్తిస్థాయిలో కంటి వెలుగు చికిత్సలు అందిస్తామని వైద్యాధికారి డాక్టర్ వరలక్ష్మి తెలిపారు. ఆప్తాల్మీక్ ఆఫీసర్ ప్రకాష్, ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనిల్, ఆరోగ్య కార్యకర్త సంతోషి, ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, పుష్ప, రాజమణి, అంగన్వాడీ టీచర్లు పద్మ లత, శ్యామల, స్వప్న, మమత పాల్గొన్నారు.