మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
శరీరం దారుఢ్యం పెంపొందించడంతో పాటు,ఆత్మ రక్షణకు కరాటే ఎంతో అవసరమని మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి అన్నారు. సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ ”బ్లూమింగ్ బడ్స్ కాన్వెంట్ స్కూల్ ” లో శీను మాస్టర్ ఆధ్వర్యంలో కరాటే, కుంగ్ పూ జాతీయ పోటీలను మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలం లో బాలికలు మహిళలపై జరుగుతున్న దాడుల గురించి తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో చిన్నప్పటి నుంచే బాలి కలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని చెప్పారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. కేవలం చదువే కాకుండా విద్యార్థులను క్రీడల వైపు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిం చాలని కోరారు. పిల్లలకు తమ ఆత్మ రక్షణ కోసం కరాటే లో శిక్షణ అందించిన మాస్టర్ శ్రీను అభినందించారు. అందరికీ జీవితంలో కరాటే అనేది ముఖ్యమైనదని ప్రతి ఒక్కరికి అవసరమైన సమయంలో ఉపయోగ పడుతుందని, కొం దరికి ఉపాధి కూడా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టార్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.