కారెక్కనున్న కాసాని

Kasani is far awayనవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌ :
తెలంగాణ తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ కారెక్కనున్నారు. ఎన్నికల్లో టీడీపీ పోటీి చేయక పోవడాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన ఆయన గులాబి కండువా కప్పుకునేందుకు ముహుర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. భద్రతా కారణాల దష్ట్యా పరిమిత సంఖ్యలో తన అనుచర నాయకులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.