నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తొమ్మిదన్నరేండ్ల పాలనలో సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజల్లో ఆనందం కనిపిస్తున్నదని తెలిపారు. బీజేపీకి క్యాడర్ లేదనీ, కాంగ్రెస్ కు లీడర్లు లేరనీ, ఆ రెండు పార్టీలు వాపును చూసి బలుపనుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ గెలవబోతున్నదనేందుకు భారీ చేరికలే నిదర్శనమని ఆయన తెలిపారు.