– 25న సీఎం చేతుల మీదుగా సచివాలయంలోని చర్చి ప్రారంభం
– తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్రైస్తవ సమాజానికి సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా ఉన్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఆ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు యావత్ క్రిస్టియన్లు రుణ పడి ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన చర్చిని క్రైస్తవ నాయకులతో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర సచివాలయంలోనూ క్రైస్తవులకు ప్రార్ధన మందిరం లేదని తెలిపారు. అయితే తెలంగాణ సచివాలయంలో మాత్రం అద్భుతమైన చర్చిని సీఎం కేసీఆర్ నిర్మించారని చెప్పారు. వందల ఏండ్ల క్రితం చర్చిలు ఏ విధంగా కనువిందు చేసేలా ఉన్నాయో…. ఈ చర్చి సైతం అలాగే చూపరులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చర్చిని ప్రారంభించనున్నట్టు రాజీవ్ సాగర్ తెలిపారు.