కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం…

– అధికార పార్టీతో ఉంటేనే అభివద్ధి
– ఒక్క అవకాశం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తా
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
నవతెలంగాణ- ములుగు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతత్వంలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని, అధికార పార్టీతో ములుగు ఉంటేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఆదివారం అంకన్న గూడెం, జగ్గన్నగూడెం, లాలాయి గూడెం, సర్వా పుర్‌, రాయినిగూడెం, పెగడపల్లి, దుబ్బ గూడం, కొత్తూరు, కాసిందేవి పేట తదితర గ్రామాల్లో నాగజ్యోతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు కేసిఆర్‌ తనకు ఒక అవకాశం కల్పించాడని, ప్రజలు తనను గెలిపిస్తే ప్రజా సమస్యలన్నీ తీర్చేందుకు కృషి చే స్తానని అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందు కు కాంగ్రెస్‌ పగటివేషగాళ్లు మళ్లీ వస్తున్నారని, వాళ్ళ మాయమాటలు నమ్మ వద్దన్నారు. పక్క రాష్ట్రం చత్తీస్గఢ్లో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు లేవని, అలాంటివారు తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని అన్నారు. ఒక్క ములుగు జిల్లా లోనే ఇప్పటి వరకు పదివేల మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించినట్టు తెలిపారు. ఛాతిసఘడ్లో కేవలం 500 మాత్రమే పెన్షన్‌ ఇస్తున్నారని, మూడో సారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే తెలంగాణలో రూ.5వేలు అందిస్తామని చెప్పారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద 3000 ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల్లో గెలవగానే ఇల్లు లేని ప్రతి కుటుం బానికి పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివద్ధి చేసి చూపిస్తానని అన్నారు. అధికార పార్టీలో ఉంటేనే అభివద్ధి సాధ్యమై తుందన్నారు. గిరిజనేతర్లకు కూడా పోడుపట్టాలతో పాటు అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు కల్పించేం దుకు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు గుర్తు చేశారు. గోదావరి నది నదీ జలాలతో ఈ ప్రాంతం భూములకు పూర్తిస్థాయిలో తాగు సాగునీరు అందించేందుకు కషి చేస్తానన్నారు. టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు కాకులమ్మరి లక్ష్మణరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ములుగులో దివంగత మంత్రి చందులాల్‌ ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లాను ఏర్పాటు చేశారని, బడే నాగజ్యోతిని గెలిపించి ముఖ్యమంత్రి కానుక ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ రెడ్‌ కో చైర్మన్‌, ములుగు ఎన్నికల ఇంచార్జ్‌ ఏరువ సతీష్‌ రెడ్డి, ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్‌, మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్‌, మాజీ ఎంపీపీ మసరగాని వినరు కుమార్‌, సీనియర్‌ నాయకులు సత్యనారాయణ, రాయినిగూడెం గ్రామ అధ్యక్షులు రంజిత్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు దబ్బాగట్ల సాంబయ్య, కొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.