విప్లవాన్ని సృష్టించిన కేసీఆర్‌ కోలేటి దామోదర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదారాబాద్‌
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్‌ విప్లవం సృష్టించారని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ కొనియాడారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు కండ్లుండి చూడలేని కబోదులని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయం కోసం ఊరూ, వాడ జనం నినదిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తున్న విపక్షా లకు గుణపాఠం ప్రజలే చెబుతారని హెచ్చరించారు.