– క్రీడాకారులకు స్వర్ణయుగం :మంత్రి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేసీఆర్ పాలనా కాలం క్రీడాకారులకు స్వర్ణయుగమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, భూగర్భ వనరులశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మహేందర్ రెడ్డి నివాసంలో తొలి తెలుగు భారత అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ గోలి శ్యామల ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 3న కలకత్తాలో జరిగిన భగీరథ నదిలో 81 కిలోమీటర్ల దూరాన్ని శ్యామల కేవలం 13 గంటల్లో ఈదిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఆమెను శాలువాతో సత్కరించి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ప్రపంచ రికార్డు స్థాపించడం పట్ల ఆమెను అభినందించారు. రానున్న రోజుల్లో శ్యామలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.