కేసీఆర్ నామినేషన్ దాఖలుకు తరలి రావాలి

నవతెలంగాణ-భిక్కనూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గురువారం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి, మండలం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నందున నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని, ప్రజలు విషయాన్ని గ్రహించి, ప్రతిపక్షా పార్టీల మాటలను నమ్మవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ కామారెడ్డి నుండి పారిపోయారని, కాంగ్రెస్ పార్టీ ముందుగానే తమ ఓటమిని అంగీకరించిందన్నారు. ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ లు భూమి రెడ్డి, భూమయ్య, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.