24న సూర్యాపేటకు కేసీఆర్‌

– సమీకృత కలెక్టరేట్‌, మార్కెట్‌, మెడికల్‌ కాలేజ్‌,ఎస్పీ కార్యాలయాల ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 24న సూర్యాపేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, సమీకృత మార్కెట్‌ను ఆయన ప్రారంభిస్తారు. తదనంతరం నిర్వహించే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.