నవతెలంగాణ -పెద్దవూర : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను చూడగానే ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ వణుకు పుట్టిందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లోమాట్లాడారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అతని పేరు పెట్టి పిలిచేటటువంటి అర్హతలేని ఆయన జానా రెడ్డి ఏం చేశారు అని మాట్లాడుతున్నారు. సవాలు సిద్ధమా రండి కూర్చుదాం అని సవాల్ విసిరారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను ఏసీఆర్ మోసం చేశారని విమర్శలు చేశారు. దళితులకు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు కానీ ఒక ఎకరం కూడా ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నారుకానీ ఒక్కరి కూడా ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ వారి కుటుంభం లో నలుగురురికి మాత్రమే వచ్చాయని అన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, పేపర్ లీకేజి చేసి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. నా హయాంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం లోఎడమ కాలువ పై 34 లిఫ్ట్ లు ఏర్పాటు చేసి 2,000,00ఎకరాలకు సాగునీళ్లు,35000 ల ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాల కల్పన చేసిన ఘనతఅని అన్నారు. తెలంగాణ ఇస్తామన్నాము అలాగే ఇచ్చాము. లక్ష ఋణ మాఫీ చేస్తామన్నాము అదికూడా చేశాము. కాంగ్రెస్ అధికారలోకి రాగానే ఒకే సారి 2,00,000 ఋణ మాఫీ చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు 70ఏళ్ళు దాటినా చెక్కు చెదరలేదని కేసీఆర్ నిర్మాణం చేసిన ప్రాజెక్టు అప్పుడే బీటులు వారాయని విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతొ వేలకోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని అన్నారు. కేసీఆర్ కు మిల్లి పట్టం కడితే తెలంగాణ రాష్ట్రన్నే తాకట్టు విమర్శలు చేశారు. రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే మళ్ళీ ఇందిరమ్మ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే దొరల తెలంగాణ ను ప్రజల తెలంగాణ గా మార్చు తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి, పిసిసి ప్రతినిధి కర్నాటి లింగారెడ్డి, మాజీ ఎంపీపి రమావత్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్ర శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమావత్ చందు, కల్లూరి వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సి సెల్ అధ్యక్షులు దండు బిక్షం, శ్రీనివాస్, ప్రేమ్ చంద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.