ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు

– పోచారం ఓటువేసి ఆశీర్వదించండి 
నవతెలంగాణ-నసురుల్లాబాద్
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది. మీర్జాపూర్ గ్రామంలో ఎంబు పోషవ్వ అనే మహిళా తన భర్త ఫోటోలు తీసుకువచ్చి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చూయించింది తన భర్త బలరాజ్ చనిపోవడంతో కుటుంబం వీధిన పడిందని కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమాతో తమ కుటుంబానికి ఆసరాగా నిలిచారని, అందుకు కేసీఆర్, పోచారం కు ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఇటీవల విద్యార్థులకు ప్రవేశపెట్టిన అల్పాహారం, తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం, సన్న బియ్యం, ఆసరా పెన్షన్ పెంపు, రైతు బంధు పెంపుతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ను బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, కారు గుర్తుకు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్ జిల్లా కో ఆప్షన్ మెంబర్ మజీద్ సొసైటీ అధ్యక్షుడు మారుతి పటేల్ సర్పంచులు శ్యామల శ్రీనివాస్ పురం లక్ష్మీ వెంకటరమణ, జిల్లా మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు నర్సగౌడ్, నాగన్న పటేల్ ,జంగిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.