
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని రైతులకు ఇచ్చిన హామీ పి పూర్తి స్థాయిలో నేరవేర్చారని డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, బీఅర్ఎస్ ఇందల్ వాయి మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్ అన్నారు.గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంతోపాటు, నల్లవెల్లి, గన్నరం,డిచ్ పల్లి మండలం లోని మెంట్రాజ్ పల్లి తోపాటు ఇతర సహకార సొసైటీ లో కెసిఆర్, ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రం పాటలకు పాలాభిషేకం నిర్వహించారు. రైతు రుణమాఫి చేయడం పాట్లా రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు రుణమాఫీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని, ఇవాళ్టి నుంచి అందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినందుకు రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సహకార సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి,చింత శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి లు చింతల దాస్, కచ్చకాయల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నిజామాబాద్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్, అరటి రఘు, సిహెచ్ దాస్, బిరిష్ శేట్టి, సర్పంచులు కుమార్ నాయక్, పరుశురాం నాయక్,చందర్ నాయక్, మొచ్చ గోపాల్, పిండి గంగాధర్, ఎంపీటీసీ లావణ్య, కుంట కిషన్ రెడ్డి, బద్దం రవి, పట్టి పురం గంగాధర్, నాయిని అశోక్, కుంట లక్ష్మయ్య, చిల్లా అశోక్, ఎర్ర గంగాధర్, అంజన్న, చంద్రయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.