పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్ దొంగరి కోటేశ్వరరావు.
నవతెలంగాణ – చివ్వేంల: వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్ దొంగరి కోటేశ్వరరావు అన్నారు. శనివారం తుల్జారావు పేట గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది తో మురికి కాల్వలు పూడిక తీయించి మాట్లాడారు. గ్రామ ప్రజలు వర్షాకాలం లో దోమలు వ్యాప్తి చెందకుండా నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాలు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ డైరెక్టర్ పత్తిపాక వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.