
-నవ తెలంగాణ – బంజారా హిల్స్..
పచ్చదనంలో దేశంలో అగ్ర స్థానంలో ఉన్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,కార్పొరేటర్లు తెలిపారు.
సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్,సోమాజిగూడ,వెంకటేశ్వర కాలనీ, జూబ్లీహిల్స్,బంజారా హిల్స్ డివిజన్ల పరిధిలో దశాబ్ది ఉత్సవలాను పురస్కరించుకొని హరితహారంలో భాగంగా నిర్వహిస్తున్న సందర్భంగా నూతనంగా అయా ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు పార్కులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలందరూ నడుం కట్టాలని అన్నారు. దేశంలో గ్రీనరీ పెంపకంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పటికీ దేశానికి దిక్సూచి గాని ఉంచాలని మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడం కూడా మన అందరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిహెచ్ఎంసి అధికారులు,సోమాజిగూడ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ డివిజన్ వెల్దండ వెంకటేష్, బంజారాహిల్స్ మేయర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.