‘ఇండియా’ మూడో సమావేశానికి హాజరవుతాం : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ మూడవ సమావేశానికి హాజరవుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవా రం ప్రకటించారు. ఆగస్ట్‌ 31న ముంబయిలో సమావేశం కానున్నట్లు ‘ఇండియా’ కూటమి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ముంబయి సమావేశంలో పాల్గొని, ప్రతిపక్షాల వ్యూహం ఏమిటో తెలుసుకుంటాం’ అని కేజ్రీవాల్‌ మీడియాతో అన్నారు. ఢిల్లీ బిల్లుకి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించకపోవడంతో ఇండియా కూటమి మొదటి సమావేశానికి ఆప్‌ హాజరుకా లేదు. జులై 17-18 తేదీల మధ్య బెంగళూరులో నిర్వహించిన రెండో సమావేశానికి ఆప్‌ హాజరైన సంగతి తెలిసిందే.