ఆడుతూ.. పాడుతూ.. ఆనందోత్సాహ ఘడియలను ఆస్వాదించాలన్న ప్రజల ఉత్సాహం కేకులు, పండ్లు, పూల బొకేలకు విపరీతమైన డిమాండ్ సష్టించింది. ఎంగేజ్‌మెంట్, రిటైర్‌మెంట్, పండుగలు, పర్వదినాలు, వార్షికోత్సవాలు, వసంతోత్సవాలు ఇలా వేడుక ఏదైనా కేకు ఉండాల్సిందే. పండుగలు, పిల్లల అభిరుచిని బట్టి వివిధ రకాల కేకులు తయారు చేయడానికి తయారీదారులు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల డ్రీమ్ క్యారెక్టర్లు, ట్రైన్, బస్, విమానం, పడవ, వివిధ రకాల బొమ్మలు, జంతువులు, మనుషులు, పక్షులు, గార్డెన్‌లు, జలాశయాలు, పుష్పాలు, స్విమ్మింగ్‌పూల్స్, వాహనాలు, బహుళ అంతస్తులు ఇలా ఒక్కటని కాదు, అనేక రకాల కేకులు ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. వేడుకలను దష్టిలో పెట్టుకుని ఆయా విశేషాలు ప్రతిబింభించేలా, ఇష్టమైన తారల పుట్టిన రోజుకు వారి బొమ్మలతో కూడిన కేకులు వంటివి సర్వసాధారమయ్యాయి. సరదాతో పాటు రికార్డుల కోసం, నలుగురినీ ఆకర్షించాలనే ఉద్దేశ్యంతోనూ తయారు చేస్తున్న కేకులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
– ఆనంద ‘మైత్రేయ’మ్, హైదరాబాద్