హైదరాబాద్ : కెల్జారు వోల్కానిక్ వాటర్‌లో మెజారిటీ వాటాను తీసుకుంటు న్నట్టు క్లియర్ ప్రీమియం వాటర్ ప్రకటిం చింది. అగ్ని పర్వాతాల బుగ్గల నుంచి సేకరిం చిన విలక్షణ సహజ ఖనిజ జలాలకు కెల్జారు వోల్కానిక్ వాటర్ ప్రసిద్ది చెందింది. ఈ కొనుగోలు తమ సంస్థకు ముఖ్యమైన మైలు రాయిని అని క్లియర్ ప్రీమియం పేర్కొంది. ఇది తమ ఉత్పత్తి పోర్ట్ ఫోలియోను విస్తరించడానికి, బాటిల్డ్ వాటర్ పరిశ్రమలో ఆవిష్కరణకు మార్గదర్శకంగా నిలువనుందని తెలిపింది. దీంతో తమ మార్కెట్ ఉనికి పెరగనుందని క్లియర్ ప్రీమియం వాటర్ వ్యవస్థాపకుడు, సీఈఓ నయన్ షా పేర్కొన్నారు.