55,781 మందికి కేరళ ఓనం కానుక

 Kerala Onam gift to 55781 peopleతిరువనంతపురం : కేరళ ప్రజానీకం అత్యంత ప్రతిష్టగా జరుపుకునే ఓనమ్‌ పండుగ సందర్భంగా వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం షెడ్యూల్‌ తరగతుల (ఎస్సీ) కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించింది. ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతిని అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన 55,781 మంది ఎస్సీ లబ్దిదారులకు ఈ కానుకను అందజేశారు. ముఖ్యమంత్రి చాంబర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంపిక చేసిన కొందరు లబ్దిదారులకు ముఖ్యమంత్రి విజయన్‌ రూ.వెయ్యి చొప్పున చెక్‌లు అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమం, దేవాదాయ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి కె రాధాకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.