– కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కేజీబీవీ నాన్ టీచింగ్ – వర్కర్లను క్రమబద్ధీకరించి తక్షణమే కనీస వేతనాలను అమలు చేయాలనీ కాంగ్రెస్ పార్టీ ఇందల్వాయి మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ డిమాండ్ చేశారు. కేజీబీవీల్లో సిబ్బందికి కనీస వేతనాలు అమలు కాక, శ్రమదోపిడీకి గురవుతున్నారని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.60 కూడా వీరికి అమలు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి కేజీబీవ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.