బెదిరింపులకు భయపడేది లేదు.. ఖబర్దార్‌

– నామినేషన్‌ దాఖలు చేసిన సింగపురం ఇందిర
– పార్టీలో పలువురు ఎంపిటీసీలు
నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్‌
ప్రస్తుత రోజుల్లో ఎవ్వరూ భయపడేది లేదని, దొంగ చాటున తమ నాయకులను చేర్చుకున్న మారలా తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని, ఖబర్ధార్‌ కడియం శ్రీహరిని కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ అభ్యర్థి సింగపురం ఇందిర హెచ్చరించారు. డివిజన్‌ కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో మంగళవారం వరం గల్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ ఉత్తమ్‌ రావు దాల్వి, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్యతో కలిసి, కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సింగపురం ఇందిర నామినేషన్‌ వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిర మాట్లాడుతూ నియోజక వర్గంలో మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనకు ప్రాధాన్యత కల్పించడమే ఘనతగా వర్ణిం చారు. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడమే ప నిగా, అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్న తమ వైపు వస్తున్న శ్రేణులను కడియం చీకట్లో దొంగిలించినా వారు మా తరపు ఓటర్లే నని చెప్పారు. తెలంగాణ ప్రజా విముక్తికై ఆత్మబ లిదానాల గ్రహించి, పార్టీకి నష్టం వాటిల్లే అవ కాశం ఉన్నప్పటికీ తెలంగాణ తల్లి సోనియమ్మ స్వరాష్ట్ర కాంక్ష సాకారం చేసిందని అన్నారు. 30యేండ్ల చరిత్రని చెపుతున్న కడియం నియోజక వర్గంలో ఒక్క డిగ్రీ కళాశాల, టెక్స్‌ టైల్‌, లెదర్‌ పార్కు సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు. ఏ బూతులో ఎన్ని ఓట్లు తెస్తారో చూస్తానని, ఊరు ఊరికి ఎన్‌ కౌంటర్‌ చేసిన కడియంకు ఈ రోజుల్లో ఎవ్వరూ భయ పడరని, నా కార్యకర్తల జోలికొస్తే వదిలేది లేదని ఖబర్డార్‌ కడియం అని వ్యాఖ్యానించారు. స్థానికే తరులని తరిమే సమయమొచ్చిందని, మీ అడ బిడ్డగా ఆదరించి, చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే, గత పాలకుల కంటే మిన్నగా అభివద్ధి చేసి చూ పిస్తానని అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్సీ కి రాజీ నామా చేసి నామినేషన్‌ వేయాలని సవాల్‌ విసిరారు. 2023తో నియోజక వర్గ శాపం తొల గనున్నదని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క డబుల్‌ బెడ్‌ రూం, ఉద్యోగం, గహలక్ష్మి, దళిత బంధు, మూడెకరాల భూమి అందని ప్రతీ ఒక్కరూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తప్పక తమ న్యాయమైన డిమాండ్లను నెరవెరుస్తమని అన్నారు. మహిళా లోకం కాంగ్రెస్‌ పార్టీకి పట్టం గడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం లో పార్లమెంటు కన్వీనర్‌ జిల్లా పార్టీ శ్రేణులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.