హత్యా రాజకీయాలు మానుకోవాలి

KTR– బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు
– బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత
నవతెలంగాణ-పెద్దకొత్తపల్లి
‘గ్రామాలలో పలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయని వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. హత్యా రాజకీయాలు చేయకూడదు. ఇది ప్రజాస్వామానికే విరుద్ధం. హత్యా రాజకీయాలు మానుకోవాలి’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యర్థి పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని గంట్రావుపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం భూ తగాదాల వల్ల రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త మల్లేష్‌ హత్యకు గురి అయ్యాడు. ఈ విషయాన్ని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి ఆదివారం గంట్రావుపల్లి గ్రామంలోని మల్లేష్‌ ఇంటికి వెళ్లి మల్లేష్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మల్లేష్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఆయన వెంట మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌, మండల బిఆర్‌ఎస్‌ అధ్యక్షులు గణేష్‌రావు, హర్షన్న నాయకులు రవి నాయక్‌, కొత్తపేట సింగిల్‌ విండో అధ్యక్షులు అట్ట రాజేందర్‌ గౌడ్‌, పెద్ద కార్‌ పాముల సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, పెద్దకొత్తపల్లి మాజీ సర్పంచ్‌ జక్కుల నరసింహ, తదితరులు ఉన్నారు.