– 29 మంది వార్డు కౌన్సిలర్లు మద్దతు…
నవతెలంగాణ కోదాడరూరల్
కోదాడ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం శనివారం ప్రవేశపెట్టారు. 29 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో మున్సిపల్ చైర్ పర్సన్ ,వైస్ చైర్ పర్సన అవిశ్వాసం నెగ్గింది అని, వివరాలు పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని అనంతరం ఎన్నికలకు సంబంధించిన ఆర్ సూర్యనారాయణ తెలిపారు. 35 మంది వార్డు కౌన్సిలర్లలో ఒక కౌన్సిలర్ మృతిచెందగా, మరొక కౌన్సిలర్ కల్లూరి పద్మజ అందుబాటులో లేకపోవడంతో, 33 మంది వార్డు కౌన్సిలర్ల లో అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు. వారిలో 29 మంది అవిశ్వాస తీర్మానంలో మద్దతు పలకడం తో అవిశ్వస తీర్మానం నెగ్గింది. నలుగురు కౌన్సిలర్లు ఎవరికి మద్దతు పలకకపోవడం విశేషం. భారీ పోలీసు బందోబస్తు మధ్య అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. చైర్మన్ రైస్ లో సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావు రేసులో ఉన్నట్లు సమాచారం.