కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ- నాంపల్లి: సాధారణ ఎన్నికల సందర్భంగా మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోరుతూ నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుక్రవారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా కొనసాగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రచారానికి ప్రజల నుండి విశేషంగా స్పందన రావడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నారని, అదేవిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, సర్పంచ్ బల్గూరి విష్ణువర్ధన్ సాగర్, కోరే మురళి, బేగరి కిరణ్ కుమార్, కారింగు అహల్యమ్మ నరసింహ, నాయిని శేఖర్ రెడ్డి, బుషిపాక లీలప్రియ నాగేష్, కొలుకులపల్లి చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ మెగావత్ భాషా నాయక్,