నవతెలంగాణ – మద్నూర్
కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్, వ్యవసాయ శాఖ కామారెడ్డి అనుసంధానంతో వరి, పత్తి, పంటలో డోంగ్లి, మద్నూర్, మండలాలలోని పలు గ్రామాలలో రోగనిర్ధారక క్షేత్ర సందర్శనలు గురువారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టి విజయ్ కుమార్ సస్యరక్షణ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. వరి పొలాలలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు, కంకి నల్లి అలాగే గింజ మచ్చ తెగులు ఆశించిందని గమనించారు. బ్యాక్టీరియా ఎండు తెగులు నివారణకు కంకులు నిండే దశలో ఉంది. కాబట్టి కాపర్ సంబంధిత మందులు పిచికారి చేయకుండా, ప్లాంటమైసిన్ అనే మందు మాత్రమే 0.4 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేశారు. తద్వారా ఉధృతి కొంతవరకు తగ్గుముఖం పడుతుందని తెలియజేశారు. అలాగే కంకి నల్లి గింజ మచ్చ తెగులు నివారణకై స్పైరోమెసిఫిన్ @ 1 మీ. లి + ప్రొపికొనజోల్ @ 1 మీ. లి లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలియజేశారు. తరువాత పత్తి పంటలో క్షేత్ర స్థాయి సందర్శనలు నిర్వహించి పత్తి పంట ప్రస్తుతం కాయ ఎదుగుదల దశలో ఉందని ఈ దశలో గులాబీ రంగు పురుగు ఆశించడానికి అవకాశం ఉందని తెలియజేశారు. గులాబి రంగు పురుగు నివారణకై ఎకరానికి 10 చొప్పున లింగాకర్షణబుట్టలుముందస్తుగాఅమర్చుకున్నట్లయితే దిగుబడి నష్టం జరగకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్శన కార్యక్రమంలో డా. రాజ్కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, పి .విజయ్ కుమార్ ఎస్ఎంఎస్ రక్షణ విభాగం) రాజు (మండల వ్యవసాయ అధికారి) డోంగ్లి, మద్నూర్ మండలాలు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సమరిన్, సౌమ్య, బసవరాజ్, సంపత్ విశాల్, రైతులు గజానంద్ దేశాయ్ , శుభాష్,గంగాధర్, రాజ్ కుమార్.భీమ్ రావు తదతరులు పాల్గొన్నారు.