జీపీ కార్మికులకు పోస్టల్ ఇన్సూరెన్స్ కల్పించిన కృష్ణ పటేల్

Krishna Patel who provided postal insurance to GP workers– ఇన్సూరెన్స్ కల్పించిన నాయకునికి జీపీ కార్మికులు అభినందనలు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణ పటేల్ అతని కుమారుడు అడ్విక్ జన్మదినాన్ని పురస్కరించుకొని మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో పనిచేసే 26 మంది మల్టీపర్పస్ కార్మికులకు పోస్టల్ ఇన్సూరెన్స్ కల్పించారు. ఇన్సూరెన్స్ కల్పించిన బీజేపీ నాయకునికి పంచాయతీ కార్మికులందరూ అభినందనలు తెలియజేశారు. ఇన్సూరెన్స్ కాపీల అందజేత కార్యక్రమంలో శ్రీ పద్ పటేల్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తెప్ప వార్ తుకారాం బీజేపీ పార్టీ యువ నాయకులు తులవార్ సంతోష్ ఆర్ సుభాష్ పార్టీ పలువురు నాయకులతోపాటు పంచాయతీ సిబ్బంది మల్టీపర్పస్ కార్మికులు పాల్గొన్నారు.