నిక్కీ హెలీని కలిసిన కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్‌ నిక్కీ హెలీని మంత్రి కేటీఆర్‌ కలిశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఇండియా, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాల గురించి ఆమెతో చర్చించారు. హైదరాబాద్‌, తెలంగాణ సంబంధాలపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిక్కీ హెలీతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్‌లో కేటీఆర్‌ పోస్టు చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాల గురించి ఆమెతో విస్తత స్థాయిలో అభిప్రాయాలను పంచు కున్నట్టు ఆయన తెలిపారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీపడుతన్న నేపథ్యంలో నిక్కీకి మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.