జూన్‌ 7న ములుగు జిల్లాకు కేటీఆర్‌ రాక

– ములుగు జెడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీష్‌
నవతెలంగాణ – ములుగు
జూన్‌ 7న ములుగు జిల్లాకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ రాక సందర్భంగా ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ మంగళవారం ప్రాథమిక ఏర్పాట్లను పరిశీలించారు. ములుగు పట్టణంలో తంగేడు ప్రదేశంలో జరిగే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్‌ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ములుగు నియో జకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. అదే రోజు ములుగు పట్టణ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయానికి అలంకరణ విషయంలో నాయకులకు సూచనలు చేశారు. ములుగు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులతో కలిసి, తంగేడు గ్రౌండ్‌లో సభ స్థలిని పరిశీలించి హెలిప్యాడ్‌, బహిరంగ సభా స్థలం, పార్కింగ్‌ స్థలాలను స్థానిక నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ములుగు నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి పార్టీ నాయకులతో చర్చించారు. కేటీర్‌ పర్యటన సందర్భంగా అధికారులు, పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్‌, మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, ఏటూరునా గారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్‌ కుమార్‌, మంగపేట మండల ఇన్‌చార్జి తుమ్మ మల్లారెడ్డి, ములుగు నియోజకవర్గ యువజన ఇన్‌చార్జి కోగిల మహేష్‌, ఎంపీటీసీల ఫోరం ములుగు జిల్లా అధ్యక్షుడు పోరిక విజయరాం నాయక్‌, కందకట్ల శ్రీనివాస్‌,ఎండి ఖాజాపాషా, వేల్పూరి సత్యనారాయణ, ములుగు మండల యువజన విభాగం అధ్యక్షులు బై కానీ సాగర్‌ మల్లంపల్లి ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్‌ ఎంపీటీసీ, సమ్మయ్య, రాంబాబు, మంగపేట సోషల్‌ మీడియా కన్వీనర్‌ శ్రీహరి పాల్గొన్నారు.