గణేష్‌ మండపాల వద్ద కుంకుమార్చనలు

నవతెలంగాణ-బ్బచ్చన్నపేట
మండలం కేంద్రంతో పాటు గ్రామాల లో వాడవాడల్లో నెలకొల్పిన గణేష్‌ మండపాల వద్ద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండ ల కేంద్రంలోని 1వ పోచమ్మ టెంపుల్‌ వద్ద నెలకొల్పిన గణేష్‌ మండపం వద్ద, అలాగే బ స్టాండ్‌ పరిధిలోని ఎస్బిఐ మినీ బ్యాంకు వద్ద నెలకొల్పిన గణేష్‌ మండపం వద్ద 54 ప్రసా దాలతో గణేశునికి సమర్పించారు. ఈ కార్యక్రమాలలో సభ్యులు సందెల కవిత, దొంతుల అనిత, గొ ల్లపల్లి శ్రీవాణి, శిలపురం హేమ, తోడుపునురి విజయలక్ష్మి, దిడ్డగ జ్యోతి, పులిగిల్ల రామలింగం, పాం డురంగం, బోడకుంట శీను, కొత్తపెళ్లి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.