నవతెలంగాణ – చండూరు: ఘట్టుప్పల మండల కేంద్రం లో బీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రబకార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శనివారం ఘట్టుప్పల లో బీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రబకార్ రెడ్డి సతీమణి అరుణ కోడలు స్రవంతి వారి కుటుంబ సభ్యులు ఇంటింటికీ మహిళలకు బొట్టు పెట్టి విస్తృత ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో బీఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం ఎంపీటీసీలు అవ్వరి గీత శ్రీనివాస్ చేరుపల్లి భాస్కర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య బొడిగే వెంకటేశం చిలుకురి ఆంజయ్య పున్న కిషోర్ శంకర్ రెడ్డి జులూరి పురుషోత్తం కుండే వెంకటేష్ మంగ వెంకటేష్ ఈశ్వరప్ప చెరుకు మురళి శ్రీషేలం రాజేష్ కర్నాటి వెంకటేష్ అశోక్ రెడ్డి పెదగాని శ్రీనివాస్ బొల్లెపల్లి వెంకటేష్ చేరుపల్లి రమేష్ నారని జగన్ కృష్ణ గజవేల్లి లక్మయ్యా నెలాంటి రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.