– డీహెచ్‌కు జీవో 142పై టీఎంఎల్టీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అర్బన్ హెల్త్ సెంటర్లు 235కు గానూ ఒక్కో దాంట్లో రెండు చొప్పు పోస్టులను మంజూరు చేయాలని తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ (టీఎంఎల్‌టీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ నిజాముద్దీన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిశంకర్, కంచర్ల శ్రీకాంత్, విజయభాస్కర్, చంద్రశేఖర్, మోహన్‌రావు తదితరులు సోమవారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కావాలనీ, టీ-హబ్‌లో రెగ్యులర్ పోస్టు మంజూరు చేయాలని కోరారు. ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు వైద్యారోగ్యశాఖలో కీలకమైనీ, తమపై చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు.