హుస్నాబాద్ నామినేషన్ కేంద్రం వద్ద సౌకర్యాల కరువు

– గంటల తరబడి ఎండలోనే 
– నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
హుస్నాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ల స్వీకరణ కేంద్రమైనటువంటి ఐఓసీ కార్యాలయం వద్ద సరైన సౌకర్యాలు లేక ప్రజా ప్రతినిధులు అధికారులు  ఇబందులు ఎదుర్కొంటున్నారు. ఐఓసి కార్యాలయానికి వంద మీటర్ల దూరం నుండి అభ్యర్థులతో కొంతమందిని అనుమతిస్తారు. నామినేషన్ వేసేందుకు,  నిబంధనలు తెలుసు కోవడం కోసం ఐ ఓ సి కార్యాలయం వద్దకు వచ్చిన అభ్యర్థులు, ప్రజాప్రతినిధులకు సౌకర్యం లేక అసహనం వ్యక్తం చేశారు.. చివరకు మీడియా ను ఐఓసి బిల్డింగ్ వద్దకు రానివ్వకుండా 100 మీటర్ల దూరంలోనే ఉంచారు. ఎండలోనే నిలబడవలసిన పరిస్థితి నెలకొంది. 100 మీటర్ల దూరంలో హెల్ప్ డెస్క్, ఓ అధికారిని నియమించి పూర్తి వివరాలు చెప్పాల్సిన ఆర్ ఓ ఏలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజా ప్రతినిధులు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెగ్యులర్ గా ఐఓసీ కార్యాలయానికి వివిధ పనులపై  మూడు కిలోమీటర్ల మేర వచ్చిన వారిని  కార్యాలయానికి వెళ్ళనివ్వకపోవడంతో  వేచి చూసి నిరాశతో వేనుతిరిగి పోయారు. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్ర నిరసన వ్యక్తం మౌవుతుంది. ఎన్నికల నిబంధన ప్రకారం ప్రతిదీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆర్ ఓ ఏమాత్రం శ్రద్ధ వహించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఐ ఓ సి కార్యాలయానికి 100 మీటర్ల దూరం లో ఉన్న అభ్యర్థులు, నామినేషన్ పత్రాలు తీసుకునేవారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. అధికారుల తీరుపై రాజకీయ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి  ఆర్ ఓ  సౌకర్యాలు కల్పించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.